Lift :హైదరాబాద్ లో అమ్మాయిలు లిఫ్ట్ అడిగితే ఇవ్వొద్దు
lift : హైదరాబాద్‌లో కిలేడీల మోసాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వాహనదారులను లిఫ్ట్ అడిగి వారి పర్సులు, ఫోన్లు చోరీ చేస్తున్నారు. కొందరు వేధింపుల కేసులు పెడతామని బెదిరిస్తూ డబ్బులు లాగుతున్నారు. మరికొందరు చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్‌లో ఒక కానిస్టేబుల్ నుంచి లక్ష రూపాయలు కాజేసిన ఘటన కూడా జరిగింది. అయితే, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఓ యువతి పోలీసులకు చిక్కింది. హైదరాబాద్‌లో ఇలాంటి కిలేడీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.