
Dussehra Holidays
Dussehra holidays : ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి (అక్టోబరు 4) నుంచి ఈ నెల 13వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. 14న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
ఇటీవల విద్యాశాఖపై మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. నవంబరు 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. నవంబరు 14న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించేలా అధికారులను ఆదేశించారు.