Telangana : తెలంగాణలో రైతు భరోసా నిధులపై ఈసీ ఆంక్షలు

Telangana
Telangana : తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఈసీ పేర్కొంది.
రైతు భరోసా నిధులకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యల మీద ఎన్. వేణుకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ, సీఎం నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొంది. రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ఈసీ తాజా ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది.
 TAGS  CM RevanthEC RestrictionsElection CommissionN. Venu KumarRythu Bandhu FundsRythu Barosatelangana
