Gaddar Film Awards : గద్దర్’ సినీ అవార్డులు: అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, ‘కల్కి 2898 AD’ ఉత్తమ చిత్రం
Gaddar Film Awards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డుల వివరాలను జ్యూరీ ఛైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ అవార్డులను ప్రకటించడం విశేషం. మొత్తం 1248 నామినేషన్ల నుంచి ఎంపిక చేసిన విజేతలను ఈ సందర్భంగా ప్రకటించారు.
అవార్డుల పరిశీలన వివరాలు..
ఈ అవార్డుల కోసం 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన చిత్రాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి సంవత్సరానికి ఒక ఉత్తమ చిత్రంతో పాటు, 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు అందించారు. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. మొత్తం 11 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు వంటి విభాగాలతో కలిపి మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు దక్కాయి. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక అవార్డులను కూడా ప్రకటించారు.
2024 ఉత్తమ చిత్రాలు, నటీనటులు
2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్:
మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: ‘కల్కి 2898 AD’
రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: ‘పొట్టేల్’
మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: ‘లక్కీ భాస్కర్’
ముఖ్య వ్యక్తిగత అవార్డులు:
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (‘పుష్ప 2′ చిత్రానికి)
ఉత్తమ నటి: నివేదా థామస్ (’35 ఇది చిన్న కథ కాదు’ చిత్రానికి)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (‘కల్కి’ చిత్రానికి)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (‘సరిపోదా శనివారం’ చిత్రానికి)
ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రానికి)
ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (‘రజాకార్’ చిత్రానికి)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (‘ఊరి పేరు భైరవకోన’ చిత్రానికి)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (‘పుష్ప 2’ చిత్రానికి)
ఉత్తమ హాస్యనటులు: సత్య, వెన్నెల కిశోర్ (‘మత్తువదలరా 2′ చిత్రానికి)
ఉత్తమ బాలనటులు: మాస్టర్ అరుణ్ దేవ్ (’35 చిన్న కథ కాదు’ చిత్రానికి), బేబీ హారిక
ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రానికి)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకి అట్లూరి (‘లక్కీ భాస్కర్’ చిత్రానికి)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (‘రాజు యాదవ్’ చిత్రానికి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్‌రెడ్డి (‘గామి’ చిత్రానికి)