Kavitha : కవితకు బీఆర్ఎస్ నుంచి కౌంటర్ మొదలైందా?

Kavitha

Kavitha and KTR

Kavitha : తెలంగాణ రాజకీయాల్లో కొత్త తెరలేపే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత రాజకీయంగా స్వతంత్రంగా పయనించేందుకు ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో పార్టీ నుంచి ఆమెకు వ్యతిరేక స్వరాలు వినిపించడంలా మారుతోంది.

తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, కవిత సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నారన్న ఊహాగానాలను పరోక్షంగా సమర్థించారు. “ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా పార్టీ పెట్టొచ్చు” అన్న ఆయన వ్యాఖ్యలు, కవితపై వ్యూహాత్మక కౌంటర్‌గా కనిపిస్తున్నాయి.

ఇంతవరకు పార్టీ నుంచి ఎవరూ బహిరంగంగా స్పందించని తరుణంలో కమలాకర్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. “కవిత పార్టీ పెడితే ఎంతమంది వెళ్తారు చూద్దాం,” అంటూ మద్దతు విషయంలో హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వ్యాఖ్యలతో కవితపై పార్టీలోనే వ్యతిరేకత ఉధృతమవుతోందా? రాజకీయంగా ఆమె స్వతంత్ర ప్రయాణం ఎంత ఫలిస్తుందో చూడాలి.

TAGS