Nose : నీ ముక్కు అందంగా ఉందని అనేవాడు.. చివరకు భార్య ముక్కు కొరికేశాడు
Nose : పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా, బేర్పారా ప్రాంతంలో ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున ఘోరం జరిగింది. భర్త బాపన్ షేక్ తన భార్య మధు ఖాతూన్ ముక్కును కొరకడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనపై మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త గతంలో కూడా “అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని” బెదిరించేవాడని, ఇప్పుడు అన్నంత పనీ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బాపన్ షేక్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం