Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు

Heavy Rains

Heavy Rains

Heavy Rains in Telangana : తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో గంటలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఈ వర్షాలు సాయంత్రం వరకు కొనసాగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రహదారులపై నీరు నిలిచే సందర్భాలు ఉండవచ్చని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేయాలని అధికారులు కోరారు. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.

TAGS