Pawan Kalyan : వాళ్లను పవన్ కల్యాణ్ ఎలా గట్టెక్కిస్తాడో..?  ఆ లెక్కలు ఎలా తేలుస్తాడో..?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాన్ దాదాపు పాతికేళ్లుగా టాలీవుడ్ లో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు. ఇటు ఫిలిం ఇండస్ర్టీతో పాటు అటు రాజకీయాల్లోనూ పవర్ సెంటర్ గా అవతరించాడు.  ఇక పవన్ కల్యాన్  ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతల్లో బిజీగా ఉంటున్నారు. పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు జనసేన అధినేత.ఇక తమ అభిమాన హీరో తెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

గత ఏడాది బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కల్యాన్ మరోసారి హీరోగా తెరపై కనిపించలేదు.  ఇక పవన్ కల్యాన్ సోలోగా హిట్టు కొట్టి కూడా చాలా రోజులైంది. తమ సోలో హీరోగా వచ్చి సక్సెస్ కొట్టాలని అభిమానులు కోరుతున్నారు. ఇక పవన్ చేయాల్సిన మూడు సినిమాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా సెట్లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాన్ తన పోర్షన్ ను కంప్లీట్ చేసుకోవడానికి నిర్మాతకు డేట్లు ఇచ్చాడట. దీంతో నిర్మాత ఏఎం రత్నం పవన్ కల్యాన్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంటున్నాడు.

ఇక ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ స్టార్టయ్యి దాదాపు మూడేళ్లు దాటింది. ఓజీ షూటింగ్ ప్రారంభించి కూడా  దాదాపు ఏడాదిన్నర దాటింది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో కలుపుకుంటే  ఏడాది అవుతున్నట్లే.  త్వరలో పవన్ షూటింగ్ కు టైమిచ్చిన నిర్మాతకు ఒరిగే లాభమేంటని ఫిలిం సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది. సినిమా అంటేనే ఫైనాన్షియర్ల మద్దతుతో నడిచేది. నిర్మాతలు అప్పు తెచ్చి మరీ పెట్టిన పెట్టుబడికి వడ్డీలతో కలిపితే ఏం మిగులుతుందనే ప్రశ్న తలెత్తుంది. మరి నిర్మాతలను పవన్ ఎలా కన్విన్స్ చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. మరో వైపు ఫైనాన్షియర్లు కూడా నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారట. మరి పవన్ కల్యాన్ ఈ లెక్కలను ఎలా సరి చేస్తాడో వేచి చూడాల్సిందే.

TAGS