Harish Rao : ఎప్పట్నుంచో ‘బీఆర్ఎస్ లో విభేదాలు’ అనే మాట తరచు వినిపిస్తూ వస్తోంది. ప్రధానంగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ బాధ్యతల్ని ఎవరు మోస్తారు అనేది ప్రధానంగా నడిచే చర్చ. ఇక్కడ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆ బాధ్యతల్ని తీసుకుంటారా?, లేక మేనల్లుడైన హరీష్ రావు తీసుకుంటారా? అనే దానిపై రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే, హరీష్ రావు పరిస్థితి ఏంటి?, హరీష్ రావు మరొక పార్టీవైపు కన్నేస్తారా? అనేదే ప్రధానంగా నడిచిన చర్చ.దీనికి ముగింపు పలికారు హరీష్ రావు.
తమ పార్టీలో విభేదాలు లేవని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే తనకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు. , దాన్ని తాను స్వాగతిస్తాననన్నారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానన్నారు హరీష్ రావు.