India : పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్
India Vs Pak : భారత సైన్యం పశ్చిమ సరిహద్దుల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (EW) వ్యవస్థలను మోహరించడం ద్వారా పాకిస్థాన్ సైనిక సామర్థ్యాలను గణనీయంగా దెబ్బతీస్తోంది. భారత EW వ్యవస్థలు GPS, GLONASS, BeiDou వంటి నావిగేషన్ సిగ్నల్స్‌ను జామ్ చేసి, పాక్ డ్రోన్లు, విమానాలు, మిసైళ్లు లక్ష్యాలను గుర్తించకుండా చేస్తున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల్లోని SPECTRA సూట్స్, నావికాదళం శక్తి EW వ్యవస్థలు సముద్రంలోనూ శత్రు కదలికలను అడ్డుకుంటున్నాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ NOTAMలు జారీ చేయడం వల్ల పాక్ విమానయాన రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. పాక్ EW సామర్థ్యాలు భారత్ ముందు బలహీనంగా ఉన్నాయి, ఫలితంగా భారత్‌కు యుద్ధ రంగంలో వ్యూహాత్మక ఆధిపత్యం లభించింది.