Financial strikes : భారత్-పాకిస్థాన్ మధ్య పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. సరిహద్దా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భాగంగా భారత్ పాకిస్థాన్ ఆర్థిక మూలాలకు దెబ్బ తీయాలన్న యత్నాల్లో ఉంది. దీనిలో భాగంగా రెండు ఫైనాన్షియల్ స్ట్రైక్స్ ప్రణాళికలో ఉన్నాయి.
ముఖ్యంగా, పాకిస్థాన్‌ను FATF గ్రేలిస్టులోకి చేర్చేలా ప్రయత్నాలు జరగవచ్చని తెలుస్తోంది. అలాగే, IMF నుండి పాకిస్థాన్‌కు ఇవ్వనున్న 7 బిలియన్ డాలర్ల సాయం పై ఆందోళనలు వ్యక్తం చేయనుంది. ఇవి అమలైతే ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలవచ్చు.