Pahalgam attack : పహల్గాం దాడి ముందు మోడీకి ఇంటెలిజెన్స్ హెచ్చరిక
Pahalgam attack : కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడికి మూడు రోజుల ముందే ప్రధాని నరేంద్ర మోడీకి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అందువల్లే మోడీ తన కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ఘటనపై కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. “ప్రధాని తన భద్రత కోసం పర్యటన రద్దు చేసుకున్నారు, కానీ సామాన్య ప్రజల భద్రతను ఎందుకు పటిష్టం చేయలేదు?” అని ప్రశ్నించారు. ఖర్గే ప్రకారం.. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మరింత గట్టిగా చర్యలు తీసుకుని, ఉగ్రదాడిని అడ్డుకోగలిగేదని ఆయన అభిప్రాయం. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థపై మరోసారి చర్చకు తావిచ్చింది. అధికారులు భద్రతా లోపాలను పరిష్కరించడంలో ఎంతవరకు ముందుగా చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి.