Israeli attack on Gaza : గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 55 మంది మృతి

Israeli attack on Gaza
Israeli attack on Gaza : గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. నివాస భవనంపై దాడి చేయడంతో 55 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. ఉత్తర గాజాలోని వీట్ లాహియాలో ఓ నివాస భవనంపై మంగళవారం ఇజ్రాయెల్ దాడి చేయడంతో 55 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు పాలస్తీనా సివిల్ ఎమర్జన్సీ సర్వీసెస్ వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారని పేర్కొంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని పాలస్తీనా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇజ్రాయెల్ దాడులతో సుమారు లక్షమంది పాలస్తీనియన్లు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు లేక అమటిస్తున్నారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పేర్కొంది. గాజాలోని ఆస్పత్రుల్లో వైద్య సామగ్రి, మానవ వనరుల కొరత అధికంగా ఉందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దాడులపై కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ (సీఏఐఆర్) స్పందించింది. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అమెరికాను కోరింది.