Modi : ఏపీలో గెలిచేది కూటమే..జగన్ కు ఓటమి తప్పదు: మోదీ

Modi
Modi : పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచార గడువు ముగిసేందుకు మరికొద్ది గంటలే ఉండడంతో పార్టీలన్నీ తమ ఆఖరి అస్త్రాలను వెలికి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి తరుఫున ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ పాలన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలు వైసీపీకి ఐదేళ్లు అవకాశం ఇచ్చారు.. కానీ వైసీపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదంటూ విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మోదీ వైసీపీపై ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం ఓ తెలుగు చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ తమకు ఎప్పుడూ మిత్రపక్షం కాదన్న నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ గెలుస్తుందా అని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు.. మోదీ గెలుస్తుందని అనుకోవడం లేదన్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచే టీడీపీ తమకు మిత్రపక్షమన్న మోడీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ వ్యాఖ్యానించారు. ఆ ప్రభావం కింది స్థాయి వరకు వెళ్లిందన్నారు. ఎప్పుడూ జగన్ మాకు రాజకీయ మిత్ర పక్షం కాదన్నారు. పార్లమెంట్ లో జగన్ సందర్భాన్ని బట్టి మాకు మద్దతు ఇచ్చారు. జగన్ మా ప్రత్యర్థి గానే ఎన్నికల్లో కొట్లాడామన్నారు. అతను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తాను దేశానికి ప్రధాని.. రాజకీయాలకు అతీతంగా ఏ రాష్ట్రమైనా, పార్టీ అయినా తోడ్పాటు ఉంటుంది. ఏపీకి కూడా కేంద్రం తరఫున ఏం చేయాలో చేశాం. దేశంలో ప్రతీ రాష్ట్రానికి తోడ్పాటు అందించడం మా బాధ్యత అన్నారు మోదీ. ఒకప్పుడు టీడీపీ ఎన్డీయేలో భాగంగా ఉండేది, ప్రస్తుతం జనసేన కూడా మాతో కలిసి వస్తోంది. జనాల మద్దతు చూస్తుంటే ఏపీలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాను అన్నారు . ఎంపీ సీట్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం, అవినీతిలో మాత్రం నంబర్‌వన్ అంటూ మోదీ ఆరోపించారు. ఐదేళ్లల్లో ఏపీలో ఇసుక మాఫియా, లిక్కపర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. వైసీపీకి ఆర్థిక క్రమశిక్షణ లేదని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ అభివృద్ధి అనే పట్టాలపై పరిగెత్తిందన్నారు మోదీ.. వైసీపీ హయాంలో ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పిందని విమర్శించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఈ పరిస్థితి మారుస్తామని అన్నారు. మే 13వ తేదీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని అన్నారు..