Padayatra : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 2027లో మరో భారీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో చేసిన ప్రజా సంకల్ప యాత్ర (3,648 కి.మీ) కన్నా ఎంతో పెద్దదిగా, ఈసారి 5,000 కిలోమీటర్ల దూరం నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల ఎన్నికలలో ఎదురైన పరాజయం తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి సంపాదించేందుకు దీర్ఘకాలిక వ్యూహంతో జగన్ ముందుకు సాగుతున్నారు.
ఈ పాదయాత్ర ద్వారా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడాలని, వారి పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 2026లో నిర్వహించబోయే పార్టీ ప్లీనరీలో ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు తెలిపారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జగన్ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు.