Kalvakuntla Kavitha : దయ్యాలు ఎవరో కల్వకుంట్ల కవిత చెప్పేసింది
Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో హీటు పెరుగుతోంది. గులాబీ పార్టీ లోపలే పెద్ద కలకలం. పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత హస్తం, కమలం పార్టీలతో సంప్రదింపులు జరిపిందంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం రాసింది. అయితే కవిత దీన్ని తిరస్కరిస్తూ, పార్టీలో తనకున్న నిరాశ, అణచివేత పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. తన లేఖలను బయటపెట్టినవారు ఎవరు? తనపై సోషల్ మీడియా దాడులు ఎవరిచేత జరుగుతున్నాయి? అనే అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
ఇకపోతే పార్టీలో తన స్థానాన్ని కోల్పోయిందనే భావనతోనే ఆమె తిరుగుబాటు మూడ్ లో ఉన్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు – పార్టీ వ్యవహారాల్లో తన సోదరుడు కేటీఆర్ పూర్తిగా హత్తేసినట్టు, తాను పక్కకు నెట్టబడ్డట్టుగా – రాజకీయంగా బలమైన సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
ఇంత మొత్తం కలకలానికి కారణమవుతున్న వ్యక్తి ఎవరు? ఈ కథను నడిపిస్తున్న దయ్యాలు ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.