JAISW News Telugu

India-Pak : ఇండియా పాక్ మీటింగ్ లో చర్చించుకున్న కీలక అంశాలివే

India-Pak : పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్ ఈరోజు పాకిస్తాన్ తో సాయంత్రం 5 గంటలకు యుద్ధంపై కీలక చర్చలు జరుపనుంది. ఈ మేరకు మీటింగ్ లో చర్చించాల్సిన విషయాలపై ప్రధాని మోడీ తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చర్చలు జరుపుతున్నారు. నిజానికి ఈ మీటింగ్ మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సి ఉండగా .. ప్రధాని మోడీ నివాసంలో హైలెవల్ సమావేశం కారణంగా వాయిదా పడింది. ప్రధానంగా పీఓకే ను భారత్ కు అప్పగించాలని.. జైషే, లష్కరే తోయిబా అగ్రనేతలను భారత్ కు అందించాలని .. ఉగ్రవాదాన్ని అరికట్టాలని భారత్ డిమాండ్ చేయబోతున్నట్టు సమాచారం. పాకిస్తాన్ మాత్రం కాల్పుల విరమణ, భారత్ దాడులు ఆపాలని మాత్రమే డిమాండ్ చేస్తోందట..

Exit mobile version