KTR : కవితకు వార్నింగ్ ఇచ్చేసిన కేటీఆర్.. ఏమన్నారంటే?

KTR and Kavitha
KTR : కల్వకుంట్ల కవిత లేఖ వ్యవహారంపై నేరుగా స్పందించేందుకు అన్నయ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దెయ్యం గురించే మాట్లాడుకుందామని, అదే ముఖ్యమని స్పష్టం చేశారు. అనంతరం ‘మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరైనా అధినేతకు సూచనలు, సలహాలు చేయాలనుకుంటే లేఖలు రాయొచ్చు. ఎప్పటి నుంచో ఈ కల్చర్ ఉంది, అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. అది ఎవరైనా సరే’ అని కవితను పరోక్షంగా హెచ్చరించారు.