Mahanadu : మహానాడులో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం – చంద్రబాబు, లోకేష్‌ల ప్రత్యేక ఆకర్షణ
Mahanadu 2025 : మహానాడు పండుగ ప్రారంభంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జెండా ఆవిష్కరణతో మహానాడుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన అన్న ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించారు. సభా వేదికపై నేతలను, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ మహానాడులో యువనేత నారా లోకేష్ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీనియర్లను గౌరవిస్తూ, యువతకు భరోసా ఇస్తూ ఆయన ఇచ్చిన సిక్స్ పాయింట్ ఫార్ములా తెలుగుదేశం పార్టీకి కొత్త రూపునిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భావితరాల వారధిగా, యువతరం ప్రతినిధిగా లోకేష్ తనదైన ముద్ర వేశారు. మహానాడు ప్రాంగణానికి చేరుకున్న ఆయన నేతలు, కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, చిత్తూరు పార్లమెంట్ స్టాల్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అనంతరం మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వీక్షించారు.
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాలను పెంచడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కూడా పలు ముఖ్యమైన విషయాలపై స్పందించారు. ‘మన్ కీ బాత్’ లో యోగాను ప్రముఖంగా ప్రస్తావించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కుప్పంలో తన నూతన నివాసంలో ప్రజలను కలుసుకొని, వారి విజ్ఞప్తులకు స్పందిస్తూ, సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.