Mahesh Babu : వైఫ్ ను ఎలా మ్యానేజ్ చేయచ్చో సీక్రెట్ చెప్పిన మహేశ్ బాబు
Mahesh Babu : పురుషుల లైఫ్ లో అత్యంత ఛాలెంజింగ్ వర్క్ అంటే వైఫ్ మ్యానేజ్‌మెంటే. బయటి ప్రపంచాన్ని జయించిన వ్యక్తి కూడా ఇంట్లో భార్యను జయించడం అస్సలు సులువు కాదు. ప్రేమ అంటేనే గుర్తుకు వచ్చే టైటానిక్, మోరల్స్ చూపించిన అవతార్ ను సృష్టించిన జేమ్స్ కామెరున్ కూడా ఐదుగురు భార్యలను మార్చినా లాభం లేకుండాపోయింది. వైఫ్ అంటే నైఫ్ అని కూడా చెప్తారు కదా.. భారత్ కు మొదటి ఆస్కార్ తెచ్చిన ఘనుడు ఏఆర్ రహెమాన్ కూడా 29 సంవత్సరాల తర్వాత డైవర్స్ తీసుకునే దుర్గతి పట్టింది. దీనికి కారణం ఆయన వైఫే. కారణం ఏదైనా కావచ్చు. కానీ వైఫ్ ను మేనేజ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే ఇది చాలా తక్కువ మందికి మాత్రమే కలిసి వచ్చే అంశం. అందులో ఒకరు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయనను ఇటీవల ఒక వేదికపై ‘వైఫ్ ను మ్యానేజ్ చేయడం ఎలా అని యాంకర్ ప్రశ్నిస్తే.. ఏముంది ఎప్పుడూ ఆమె ముందు నవ్వుకుంటూ ఉండడమే’ అంటూ బదులిచ్చాడు సూపర్ స్టార్. అందుకేనేమో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్ జంట ఇప్పటి వరకు ఆనందంగా ఉంది. వీరిపై సోషల్ మీడియాలో గానీ, ఇండస్ట్రీలో గానీ ఎలాంటి పుకార్లు వినిపించలేదు. ఇకపై వైఫ్ ను మ్యానేజ్ చేయాలంటే మహేశ్ బాబును ఫాలో అయితే సరిపోతుంది.
View this post on Instagram