JAISW News Telugu

Mass Raja : అల్లు అర్జున్,ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన కథతో హిట్టు కొట్టిన మాస్ రాజా

Mass Raja : 2005లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ భద్రకి నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, రవితేజ, మీరా జాస్మిన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికీ అభిమానుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈ హిట్ మూవీ మొదట అల్లు అర్జున్, తారక్ (JR ఎన్టీఆర్)కు ఆఫర్ అయిందని, కానీ వారు కొన్ని కారణాలతో వదులుకోవడంతో చివరకు రవితేజ చేతుల్లోకి వెళ్లింది. ఆ ఒక్క సినిమా రవితేజకు మాస్ మహారాజా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చినా చానెల్ మార్చకుండా చూస్తుంటారు. 20 ఏళ్లైనా కూడా భద్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Exit mobile version