Nagarjuna 100th Film : నాగ్.. వందో చిత్రం ఎప్పుడు? ఇంతకీ ఆయన నటించిన సినిమాలెన్ని?

Nagarjuna 100th Film
Nagarjuna 100th Film : కింగ్ నాగార్జున..నటుడిగానే కాదు..హోస్ట్ గానూ అదరగొడుతున్నారు. ఆరు పదులు దాటినా నవమన్మధుడిలా నేటి యువ హీరోలకు దీటుగా గ్లామర్ మెయింటెన్ చేస్తున్నారు. మొన్నటి బిగ్ బాస్ లో న్యూలుక్ తో అందరినీ అలరించారు. అదుర్స్ అనిపించే కాస్ట్యూమ్స్ తో ఔరా అనిపించారు. ఇక సంక్రాంతి బరిలోకి దిగిన తన సినిమాతో ‘నా సామిరంగ ’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మధ్య సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న నాగార్జునకు ఈ సినిమా ఒకింత రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అల్లరి అల్లుడు సినిమాలో లాగా మునపటి నాగార్జున కనిపించాడనే చెప్పాలి.
ఇక నలుగురు అగ్రహీరోలు సినిమాల సంఖ్య భారీగానే పెరిగిపోతోంది. చిరంజీవి 150 మైలురాయిని ఖైదీనంబర్ 150తో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. బాలయ్య తన 100వ చిత్రాన్ని పూర్తి చేశారు. వెంకటేశ్ తన 75వ చిత్రంగా సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ నాగార్జున వందో చిత్రంగా ఏ మూవీ వస్తుంది అని అందరిలో ఆసక్తి నెలకొంది.
నాగార్జున తెలుగు సినిమాలతో పాటు తమిళ్, హిందీ భాషల్లో సైతం నటించారు. అనేక చిత్రాల్లో అతిథి పాత్రలో కూడా అలరించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు, అతిథి పాత్రలతో ఇప్పటికే సెంచరీ కొట్టేశారు. కానీ నాగార్జున ఇంకా తన 100 చిత్రాల మార్క్ దాటలేదు అంటున్నారు.
నాగార్జున లెక్కల ప్రకారం తాను ఇప్పటివరకు 96 సినిమాల్లో మాత్రమే నటించానని అంటున్నారు. ఆయన ఎలా లెక్కపెడుతున్నారో మరి. త్వరలోనే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించబోతున్నారు. ఇందులో ధనుష్ హీరోగా నాగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక 2025 సంక్రాంతికి ‘‘బంగార్రాజు 2’’ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఆయన లెక్కల ప్రకారం ఈ రెండు సినిమాలను కలిపినా 100 చిత్రాలు కావు. మరి ఆయన తన 100వ చిత్రంగా దేన్ని ప్రకటిస్తారో చూడాలి.