Jr. NTR : నందమూరి కుటుంబం నుంచి వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్‌కు తొలి దశలో వచ్చిన సపోర్ట్ చాలా పరిమితంగా ఉండింది. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో లౌ ప్రొఫైల్ లో అరంగేట్రం చేసిన ఆయన, తానేంటో నిరూపించుకోవాలంటే టాలెంట్‌కి తోడు అదృష్టం కూడా అవసరమయ్యింది. రాజమౌళి, వినాయక్ లాంటి దర్శకుల హిట్ చిత్రాలతో ఆయన స్టార్‌గా ఎదిగాడు.
ఇప్పుడున్న సన్నివేశంలో, కొత్త ఎన్టీఆర్‌కు రెండు కుటుంబాల (నందమూరి & నారా) నుండి భరోసా, ప్రోత్సాహం గట్టిగానే కనిపిస్తోంది. ఇలాంటి మద్దతు జూనియర్ ఎన్టీఆర్‌కి తొలి దశలో ఉండి ఉంటే, నందమూరి కథ ఒక కొత్త కోణంలో సాగేదన్నది కొందరి అభిప్రాయం. కానీ, జూ. ఎన్టీఆర్ మాత్రం తన టాలెంట్‌తో, కష్టంతో, తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అదే ఆయన నిజమైన గొప్పతనానికి నిదర్శనం.