
Pavitra Lokesh
Pavitra Lokesh : సీనియర్ హీరోగా , క్యారక్టర్ ఆర్టిస్టు గా మంచి పేరు తెచ్చుకున్న నటులలో ఒకడు నరేష్. విజయ నిర్మల కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ టాలీవుడ్ లో హీరోగా అప్పట్లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజిని సొంతం చేసుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన, పెద్ద వయస్సు వచ్చాక క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా కొనసాగి తనకంటూ ఒక మంచి పేరు ని సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం ఆయన లేని సినిమా అంటూ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే నరేష్ పవిత్ర లోకేష్ ని పెళ్లాడకముందు చూపించిన జోరు, ఆమెని పెళ్లాడిన తర్వాత చూపించడం లేదు. అప్పట్లో ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలో నరేష్ కచ్చితంగా ఉండేవాడు. ఆ రేంజ్ డిమాండ్ ఉండేది. ఇప్పుడు నాల్గవ పెళ్లి తర్వాత నరేష్ సినిమాల సంఖ్య తగ్గిస్తున్నాడో, లేకపోతే వివాదాల్లో చిక్కుకున్నాడు కదా, ఇతనితో మనకి ఎందుకని నిర్మాతలు అనుకున్నారో తెలీదు కానీ, అవకాశాలు మాత్రం ముందుతో పోలిస్తే బాగా తగ్గాయి.
రీసెంట్ గా ఆయన నటించిన సినిమాలలో ‘సామజవరగమనా’ చిత్రం లో పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక విధంగా ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అంటే దానికి కారణం నరేష్ కామెడీ టైమింగ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా తర్వాత ఆయన పెద్దగా మళ్ళీ వెండితెర పై కనిపించలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పవిత్ర లోకేష్ తో తన జీవిత ప్రయాణం ఎలా ఉందో చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘జీవితం అన్న తర్వాత ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది పోతుంటారు. ఏది మన చేతుల్లో ఉండదు, నాలుగు పెళ్లిళ్లు నేను కావాలని చేసుకోలేదు, అలా జరిగిపోయిందంతే. కానీ వీటి వల్ల సోషల్ మీడియా లో వచ్చే విమర్శలు నేను తీసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను కూడా. కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత తోడు తప్పనిసరి, అందుకే నేను పవిత్ర లోకేష్ తో ఉంటున్నాను. ఇంతకు ముందు వైవాహిక జీవితం లో నేను ఎంత బాధపడ్డానో, ఎంతో మానసిక క్షోభ కి గురి అయ్యానో నాకు మాత్రమే తెలుసు. ప్రవిత్ర తో కలిసి ఉంటున్న సమయం లో కూడా నేను ఎంతో బాధని అనుభవించాను, కానీ ఆమె నాలో ఆ బాధని తొలగించడానికే ప్రయత్నం చేస్తూ ఉండేది’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.