Trees : ఐర్లాండ్‌లోని ట్రినిటీ కాలేజ్ కొత్తగా అభివృద్ధి చేసిన ‘టాకింగ్ ట్రీ’ టెక్నాలజీ చర్చనీయాంశమైంది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా, చెట్ల బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను మానవ భాషగా అనువదించడంలో ఇది సహాయపడుతుంది. దీని ద్వారా చెట్లు తమ చుట్టూ ఉన్న పర్యావరణ మార్పులను వ్యక్తపరచగలవు. నేల తేమ, గాలి నాణ్యత, ఉష్ణోగ్రత వంటి వివరాలు చెట్ల ‘మాటల’ ద్వారా మనకు అర్థమవుతాయి. ఈ టెక్నాలజీ పర్యావరణ సంరక్షణ, అవగాహన పెంపు, భవిష్యత్ ప్రమాదాల నివారణకు ఎంతో కీలకంగా మారనుంది.