Operation Sindhur : ఆపరేషన్ సింధూర్: భారత్ టార్గెట్ చేసిన తొమ్మిది ఉగ్ర స్థావరాల వెనుక కారణం

Operation Sindhur : భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేయడం వెనుక తగిన వ్యూహాత్మక మరియు ప్రతీకార ప్రణాళిక ఉంది. పుల్వామా, పహల్గాం వంటి దాడుల వెనుక ఉన్న జైష్-ఎ-మహమ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT), హిజ్బుల్ ముజాహిద్దీన్ (HM) వంటి గ్రూపుల స్థావరాలు ఇవే కావడంతో భారత్ ప్రత్యేకంగా ఈ ప్రాంతాలను టార్గెట్ చేసింది.

ఈ స్థావరాల్లో శిక్షణా శిబిరాలు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, ఆత్మాహుతి దళాల కేంద్రాలు, చొరబాటు మార్గాలు ఉండటంతో భారత ఆర్మీ వీటిని టార్గెట్ చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే దాడుల‌ను అడ్డుకునే వ్యూహాన్ని అమలు చేసింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ స్థావరాలు ఉగ్రవాద చర్యలకు కేంద్రబిందువులుగా ఉపయోగపడుతున్నట్లు నిర్ధారణ కావడంతో వీటిపై ఒకేసారి దాడి చేయడం జరిగిం

TAGS