Pedakurapadu : పెదకూరపాడు నియోజకవర్గ ఎన్డీయే కూటమి మహా ర్యాలీ ప్రారంభం

Pedakurapadu : ఈరోజు శనివారం ఎన్నికల ప్రచార ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన పెదకూరపాడు నియోజకవర్గ మహా ర్యాలీ ప్రారంభమైంది.
ఉదయం 8 గంటలకు అచ్చంపేట ఆంజనేయస్వామి విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ బెల్లంకొండ అడ్డరోడ్డు ఆంజనేయ స్వామి గుడి వరకు సాగనుంది. ఈ ర్యాలీ అచంపేట, వేల్పూరు, క్రోసూరు, యర్రబాలెం, 88 తాళ్లూరు, గుడిపాడు, గరికపాడు, గాదెవారిపాలెం, వన్నాయపాలెం, చండ్రాజుపాలెం, చిట్యాల ఆర్ అండ్ ఆర్ సెంటర్, బెల్లంకొండ, నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ అడ్డరోడ్డు ఆంజనేయ స్వామి గుడి వరకు కొనసాగుతుంది.
కావున, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు మహార్యాలీకి త్వరగా హాజరై విజయవంతం చేయవలసిందిగా పెదకూరపాడు నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రకటనలో కోరింది.
 TAGS  Bhashyam PraveenBhashyam Praveen CampaignNDA Alliance Rally.PedakurapaduPedakurapadu ConstituencyPedakurapadu News
