Poonam Kaur : పవన్ కళ్యాణ్ పై నాకు నమ్మకం లేదంటూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ వైరల్!

Poonam Kaur : ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్నారి పై జరిగిన అమానుష ఘటనపై ప్రజల లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై నటి పూనమ్ కౌర్ చేసిన సంచలన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందిస్తూ, “రాజకీయ నాయకులపై నాకు నమ్మకం లేదు. మనమే స్పందించాలి, చిన్నారి కోసం గొంతు వినిపించాలి” అని ఆమె పేర్కొన్నారు.

ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా జనసేన నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పైగా ఉన్నాయా అనే అభిప్రాయాలు నెటిజెన్స్ మధ్య వినిపిస్తున్నాయి. గతంలో కూడా త్రివిక్రమ్ మరియు పవన్ పై పూనమ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే, ఇలాంటి దారుణ ఘటనలపై పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించకపోవడంతో ఆయనపై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా బాధితుల తరఫున నాయకులు స్పందించాల్సిన అవసరం ఉందని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.

TAGS