CM Siddaramaiah : ప్రజ్వల్ ను రప్పించాలి – మోదీకి సిద్ధరామయ్య లేఖ

CM Siddaramaiah
CM Siddaramaiah : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణను విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్ పోర్టు రద్దుకు ఆదేశించాలని కోరారు. కాగా హసన్ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్ ఈ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రాగానే అతడు జర్మనీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ప్రస్తుత హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సెట్) మంగళవారం నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం సిట్ ఎదుట హాజరుకావాలని కోరినట్లు సమాచారం. రేవణ్ణ ఇంట్లో పనిచేసే ఓ మహిళ ఫిర్యాదు మేరకు హసన్ జిల్లా హోలెనర్సిపుర పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైన విషయం తెలిసిందే.
 TAGS  BJP-JDS Alliance candidateCM SiddaramaiahCM Siddaramaiah Letter to Modikarnataka cm siddaramaiahpm modiPrajwal Revanna
