Gym Review : జిమ్ కి వన్ స్టార్ రివ్యూ ఇచ్చిన పూణే కుర్రాడు.. ట్వీస్ట్ ఏంటంటే?

Gym Review

Gym Review

Pune Gym Review : పుణే కుర్రాడు జిమ్ కి వన్ స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. ఫైవ్ స్టార్స్ కు కేవలం ఒకే స్టార్ ఇవ్వడంతోపాటు తాను ఎందుకు అలా ఇచ్చాడో కూడా సవివరంగా రాసుకొచ్చాడు. ఈ మెసేజ్ చూసిన నెటిజన్లు అవాక్కవడంతోపాటు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ జిమ్ వ్యవహారం కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. పూణేకు చెందిన ఓ కుర్రాడు తన స్నేహితురాలితో కలిసి ఓ జిమ్ కు వెళ్లాడు. కొద్దిరోజులపాటు వీరిద్దరి జిమ్ సజావుగా సాగింది. ఈక్రమంలోనే వీరిద్దరికి అక్కడే జిమ్ చేస్తున్న అభిషేక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడితో వీరిద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడేవారు.

ఈక్రమంలోనే అభిషేక్ అమ్మాయితో పులిహోర కలిపాడు. అయితే పూణే కుర్రాడు మాత్రం వీరద్దరి మంచి ఫ్రెండ్ అని భావించాడు. అయితే అతడి లెక్క తప్పింది. పూణే కుర్రాడి స్నేహితురాలు తనకు హ్యండిండి అభిషేక్ తోనే వ్యామాయం చేస్తుందని రాసుకొచ్చాడు.

ఈ జిమ్ కు వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి వ్యామాయం చేశామని.. ఇప్పుడు మాత్రం తాను ఒంటరిగా జిమ్ చేయాల్సి వచ్చింది. అభిషేక్ మాత్రం తన స్నేహితురాలితో జిమ్ చేస్తున్నాడని తెగ ఫీలవుతున్నాడు.

దీంతో సదరు జిమ్ కు ఫైవ్ స్టార్స్ కు గాను వన్ రేటింగ్ ఇచ్చినట్లు తెలిపాడు. అంతేకాకుండా తన ఏరియాలో మంచి జిమ్ కోసం వెతుకుతున్నట్లు ట్వీస్ట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Trolls Official (@trolls_official)

TAGS