Rain Alert : నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Rain Alert
Rain Alert : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ జిల్లాల్లో వానలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా సంబంధిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గత రెండు, మూడు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో కల్లాల వద్ద ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
 TAGS  rain alertRainstelanganaTelangana rain alerttelangana rainsTelangana weatherWeather ForecastWeather Reportweather updatesyellow alert
