Rave Party At Himaja House : హిమజ ఇంట్లో రేవ్ పార్టీ.. 11 మంది సెలెబ్రిటీలు అరెస్ట్.. క్లారిటీ ఇదే!

Rave Party At Himaja House
Rave Party At Himaja House : నటి హిమజ గురించి తెలుగు వారికీ బాగా తెలుసు.. ముందుగా సీరియల్ లో హీరోయిన్ గా నటించి మెప్పించి ఆ తర్వాత వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించు కోవాలని వచ్చింది. అనుకున్నట్టుగానే ఈమెకు సినిమాల్లో హీరోయిన్ పక్కన స్నేహితురాలిగా బాగానే ఆకట్టుకుంది..
నేను శైలజ, వరుడు కావలెను, వినయ విధేయ రామ, శతమానం భవతి వంటి సినిమాల్లో ఈ అమ్మడు పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది.. ఇక మధ్యలో ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా అలరించింది. ఈ షోలో పాల్గొని మరింత ఫాలోయింగ్ ను తెచ్చుకుని ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అలరిస్తుంది.
ఈ భామ హీరోయిన్స్ కంటే ఎక్కువ ఫోటో షూట్స్ చేస్తూ భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ తన ఇంట్లో రేవ్ పార్టీ చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు భగ్నం చేసారని దాదాపు 11 మంది సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా హిమజ ఒక వీడియోను రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చేసింది..
తాను దీపావళి సందర్భంగా తనకు కావాల్సిన వారిని పిలుచుకుని కొత్త ఇంట్లో సెలెబ్రేట్ చేసుకున్నానని ఈ విషయాన్నీ ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఏదైనా చట్టవిరుద్ధంగా జరుగుతుందేమో అని చెక్ చేసుకుని వెళ్లారని అందుకే పోలీసులు వచ్చారని వీడియోలో చెప్పుకొచ్చింది..
పోలీసులు తమను ఎంతో మర్యాదగా పలకరించారని.. మేము కూడా వారికీ కోపరేట్ చేశామంటూ తెలిపింది.. మీడియాలో మాత్రం రేవ్ పార్టీని భగ్నం చేసి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసినట్టు వస్తున్నా వార్తలను ఖండించింది.. నిజం ఏంటో తెలియకుండా వ్యూస్ కోసం ఇలా రాయడం సమంజసం కాదని తెలిపింది..
ఈ వార్తలు సోషల్ మీడియాలో చూసి బయపడి అంత తనకు తెలిసిన వారు కాల్స్ చేసి అడుగుతున్నారని అందరికి చెప్పలేక ఇలా వీడియో తీసి రిలీజ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఈ భామ అరెస్ట్ అయినట్టు వస్తున్నా వార్తలకు చెక్ పడింది..
