Janu Liri : రెండో పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన జాను లిరి!

Janu Liri : ఫోక్ డ్యాన్సర్ జాను లిరి రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తాజాగా అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఫోక్ సింగర్ దిలీప్ దేవ్‌గన్‌ను పెళ్లి చేసుకోబోతున్నానని జాను ఇన్‌స్టాలో ఫోటోతో షేర్ చేస్తూ “ఆశీర్వదించండి” అని రాసింది. దిలీప్ కూడా వీడియో ద్వారా ఇదే విషయాన్ని తెలియజేసి, ఇద్దరూ కుటుంబాల సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశాడు. ఇటీవల జాను ఎమోషనల్ వీడియోలో రెండో పెళ్లిపై వస్తున్న విమర్శలకు బదులిచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

TAGS