JAISW News Telugu

Congress : సంచలనం : గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల ధర్నా..

Congress : హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద నేడు మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునీతారావుకు వ్యతిరేకంగా పలువురు మహిళా నేతలు ధర్నా నిర్వహించారు. సునీతారావు పార్టీలో పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని, పైసలకు పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన మహిళా నేతలు సునీతారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “సునీతా హటావో, గోషామహల్ బచావో” అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్టీలో సీనియర్ నాయకురాళ్లకు, అర్హులైన వారికి పదవులు దక్కకుండా సునీతారావు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఈ ధర్నాలో పాల్గొన్న మహిళా నేతలు, సునీతారావుపై పార్టీ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలని, నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఆరోపణలపై సునీతారావు స్పందన తెలియాల్సి ఉంది.

Exit mobile version