JAISW News Telugu

Jubilee Hills : జూబ్లీహిల్స్‌లో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి: 28ఏళ్ల యువతిపై కేసు

Jubilee Hills : జూబ్లీహిల్స్‌లో 16ఏళ్ల బాలుడిపై అదే ఇంట్లో పనిచేసే 28ఏళ్ల యువతి లైంగిక దాడి చేసిన ఘటన బయటపడింది. బాలుడు తల్లిదండ్రులు ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో పని చేస్తూ సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆ మహిళ తరచూ అతడిని తన క్వార్టర్‌లోకి పిలిపించుకుని అతడిపై లైంగిక దాడికి పాల్పడేది. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లి మీద దొంగతనం కేసు పెట్టించి ఉద్యోగం నుంచి తీసివేయిస్తానని బాలుడిని బెదిరించేది. తన తల్లి ఉద్యోగం పోతుందనే భయంతోనే అతను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. యువతి బాలుడిని బెదిరించి తన గదిలోకి పిలిపించుకుని పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, యువతిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు.

Exit mobile version