Sree Vishnu : సింగిల్ సినిమా ట్రైలర్ వివాదం : శ్రీవిష్ణు మూవీపై కన్నప్ప టీం ఆగ్రహం
Sree Vishnu : టాలీవుడ్లో “సింగిల్” సినిమా ట్రైలర్ చుట్టూ వివాదం కొనసాగుతోంది. ట్రైలర్లో హీరో శ్రీవిష్ణు “శివయ్య” అని పిలిచిన సన్నివేశం, అలాగే “మంచు కురిసిపోయింది” అనే డైలాగ్ పై కన్నప్ప సినిమా టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మంచు మోహన్ బాబు ఇంటి పేరు కనుక ఈ వ్యాఖ్యలు వారిని వెక్కిరించినట్టుగా అనిపించాయని ఆయన కుటుంబం, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో శ్రీవిష్ణు మంచు కుటుంబానికి క్షమాపణ చెప్పాడు.