Boot Cut Balaraju : ఎంత సింపతీ డ్రామా చేసిన ఫలించని సోహెల్ ప్రయత్నం..’బూట్ కట్ బాలరాజు’ 2 వసూళ్లు ఎంతో తెలుసా?

Boot Cut Balaraju 2nd day collections
Boot Cut Balaraju : బుల్లితెర మీద వచ్చిన క్రేజ్ , పాపులారిటీ ని చూసుకొని కొంతమంది సెలబ్రిటీస్ సినిమాల్లో సక్సెస్ అవుతాము అని ఇండస్ట్రీ కి వచ్చి ఉన్న కెరీర్ ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కూడా చేరిపోతాడేమో అని అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలబడి నాగార్జున ఇచ్చిన డబ్బులతో బిందాస్ గా బయటకి వచ్చాడు.
బయటకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు సినిమాల్లో హీరో గా చెయ్యడం ప్రారంభించాడు. బిగ్ బాస్ హౌస్ నుండి ఆయన బయటకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు సినిమాలు విడుదల చేసాడు. నాలుగు సినిమాలు కూడా ఎప్పుడు విడుదలైందో, ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా ప్రేక్షకులకు తెలియని రేంజ్ లో డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘బూట్ కట్ బాలరాజు’ చిత్రం విడుదలైంది.
ఈ సినిమా విడుదలకు ముందు సోహెల్ నా సినిమాని చూడండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోకాళ్ళ మీద కూర్చొని ఎంత ప్రాధేయపడ్డాడో మనమంతా చూసాము. ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. తన ఇంటిని నిర్మించుకోవడానికి దాచిపెట్టుకున్న డబ్బులతో పాటుగా, ఆయన నాన్న రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులను కూడా పెట్టి ఈ సినిమాని నిర్మించాడు. అలా దాదాపుగా ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం 5 కోట్లు ఖర్చు చేసాడు. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చింది కానీ వసూళ్లు లేవు. కొన్ని థియేటర్స్ లో జనాలు లేక షోస్ క్యాన్సిల్ కూడా అయ్యాయి.
ఈ విషయం ని తెలుసుకున్న సోహెల్ చాలా బాధపడ్డాడు. నా సినిమాని చూడండి అంటూ మరోసారి ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. కానీ ఎంత ఏడ్చినా కూడా సోహెల్ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండు రోజులకు కలిపి కేవలం 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. పాపం సోహెల్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో. బయట కూడా ఈ సినిమా కోసం అప్పులు భారీ గా చేసాడట. ఓటీటీ లో కూడా ఇంకా ఈ చిత్రం అమ్ముడుపోలేదట.