JAISW News Telugu

Sudhakar Son Wedding : ఘనంగా సుధాకర్ కొడుకు పెళ్లి..దగ్గరుండి జరిపించిన సినీ స్టార్స్

Sudhakar Son Wedding

Sudhakar Son Wedding

Sudhakar Son Wedding : ప్రముఖ తెలుగు హాస్యనటుడు సుధాకర్  రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పలు సినిమాల్లో విలన్ గా, హీరోగా నటించినా హాస్యనటుడిగానే ఎక్కువ పేరు సంపాదించారు. చిరంజీవి, సుధాకర్, జి.వి. నారాయణరావు, ప్రసాద్ బాబు వీళ్లంతా తొలినాళ్లలో బెస్ట్ ఫ్రెండ్స్. అప్పట్లో చిరంజీవి హీరోగా నటించిన అనేక సినిమాల్లో వీళ్లంతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసేవారు.

1990ల్లో సుధాకర్ టాప్ కమెడియన్ గా రెమ్యూనరేషన్ తీసుకున్నారు. చిరంజీవి సినిమాలతో పాటు సుస్వాగతం, శుభాకాంక్షలు, సూర్యవంశం, రాజా.. వంటి ఎన్నో సినిమాల్లో కామెడీతో అలరించారు. వెంకటేశ్, జగపతిబాబు కాంబోలో పలు సినిమాల్లో నటించారు. సుధాకర్ చివరిగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ద్రోణ’ సినిమాలో కనిపించారు. అలాగే ‘ఈఈఈ’ అనే మరో చిత్రంలో కూడా నటించారు.

Sudhakar Son Wedding

సినిమాలు మానేసిన తర్వాత సుధాకర్ అనారోగ్యం పాలై కుర్చీకే పరిమితం అయ్యారు. ఆయన ఒక్కగానొక్క కొడుకు బెనిడిక్ మైఖేల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా బెన్నీ ఎంట్రీ ఉంటుందని కూడా సుధాకర్ చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా.. ఇటీవల సుధాకర్ కొడుకు పెళ్లి జరిగింది.  జగపతిబాబు, బ్రహ్మనందం, రోజారమణి, చంద్రబోస్, సుచిత్రా చంద్రబోస్ వంటి వారు వివాహ వేడుకలో సందడి చేశారు.

బెన్నీ వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. సుధాకర్ ఆరోగ్య పరిస్థితి బాలేదు. అందువల్ల ఆయన నడవలేకపోతున్నారు. అయినా టాలీవుడ్ సెలబ్రిటీలు సుధాకర్ కొడుకు పెళ్లిని దగ్గరుండి జరిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version