Pawan Kalyan : టిడిపి మహానాడు.. పవన్ సంచలన కామెంట్స్!

Pawan Kalyan
Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడు వంటి నేతల ప్రసంగాలు హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా లోకేష్ ప్రవేశపెట్టిన ఆరు శాసనాలపై చర్చ కీలకంగా మారింది.
ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మహానాడు పై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి కష్టకాలంలో అండగా నిలిచిన పవన్, చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ, మహానాడు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. యువగళం, సామాజిక న్యాయం, అన్నదాతకు అండ వంటి అంశాలపై జరిగే చర్చల్ని ప్రశంసించారు.
పవన్ కళ్యాణ్ ప్రకటనకు టిడిపి శ్రేణుల నుంచి విశేష స్పందన వెల్లువెత్తింది.