Thanksgiving Day 2024: : థాంక్స్ గివింగ్ ఎప్పుడు? తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత, వేడుకలపై స్పెషల్ స్టోరీ
Thanksgiving Day 2024 : థాంక్స్ గివింగ్ 2024: హాలోవీన్ సీజన్ తరువాత.. క్రిస్మస్ పండుగలు ప్రారంభమయ్యే ముందు, పండుగ భోజనాన్ని ఆస్వాదించడానికి, కలిసి సమయాన్ని గడపడానికి.. ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి స్నేహితులు-కుటుంబ సభ్యులను కలిపే మరో సెలవుదినమే థాంక్స్ గివింగ్ డే. ఇది యునైటెడ్ స్టేట్స్లో జాతీయ సెలవుదినం. మీరు ఈ పండుగను జరుపుకుంటున్నట్లయితే, దాని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
-థాంక్స్ గివింగ్ 2024 ఎప్పుడు?
నవంబర్ నాలుగో గురువారం నాడు థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ఇది నవంబర్ 28 న వస్తుంది.
– థాంక్స్ గివింగ్ 2024: చరిత్ర, ప్రాముఖ్యత
థాంక్స్ గివింగ్ డే ఎప్పుడు ప్రారంభమయ్యిందన్నది చూస్తే.. చాలా కాలం క్రితమే మొదలైంది కానీ ఎప్పుడన్నది ఖచ్చితంగా చెప్పబడలేదు. చాలా మంది ఈ రోజును ప్రియమైన వారి సహవాసాన్ని ఆస్వాదించడానికి.. కృతజ్ఞత చూపించడానికి ఒక అవకాశంగా చూస్తారు. ఈ పండుగ ఫుట్ బాల్ ఆటలు, మంచి పార్టీ చేసుకోవడానికి వాడుకుంటారు. సాంప్రదాయకంగా, రైతులు థాంక్స్ గివింగ్ రోజున తమ శరదృతువు పంట కోసం దేవునికి కృతజ్ఞతలు తెలిపడానికి వాడుతారు..
ఈ పండుగ యొక్క మూలాలు చూస్తే.. 1621 లో ఒక స్థానిక తెగ-వాంపానోగ్ వారి నుంచి ఏర్పడింది. చాలా కాలం క్రితం భూమిని ఆక్రమించిన.. అమెరికాలో కొత్తగా స్థిరపడిన ఆంగ్ల వలసవాదుల మధ్య పంటకోత విందు చేసుకున్నప్పుడు ఈ పండుగ జరిపారని సమాచారం. ఇది తరచుగా తెల్ల జాతీయుల కోణం నుండి చెప్పబడే కథ గా ప్రాచుర్యం పొందింది.
అయితే ఇది 1863 వరకు జాతీయ సెలవుదినంగా మారలేదు. 1789 లో అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ గురువారం, నవంబర్ 26, బహిరంగ థాంక్స్ గివింగ్ దినంగా ప్రకటించారు. వైట్ హౌస్ ప్రకారం.. కొత్త రాజ్యాంగం ప్రకారం థాంక్స్ గివింగ్ జరుపుకోవడం ఇదే మొదటిసారి. తరువాత 1863లో, అబ్రహం లింకన్ థాంక్స్ గివింగ్ను సెలవు దినంగా.. ఉద్యోగులకు ఒక రోజు సెలవు దినంగా ప్రకటించారు.
*ఎంతోమంది ప్రాణాలు కాపాడిన డా.జై గారికి కృతజ్ఞతలు
రక్తదానమే మహాదానం అంటూ యూబ్లడ్ యాప్ ను సృష్టించి ఎంతో సామాజిక సేవ చేస్తున్న యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారికి ఈ థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా రక్తదాతలు, తీసుకున్న వారు, అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి రోజున మనకు సాయం చేస్తున్న డా.జై గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంటున్నారు.