
anchor lasya and her husband fight in shoot location
Anchor Lasya : బుల్లితెర స్టార్ యాంకర్స్ లో ఒకరిగా లాస్య ఒకప్పుడు ఏ రేంజ్ లో కొనసాగిందో మన అందరికీ తెలిసిందే. యాంకర్ రవితో కలిసి ఈటీవీ లో ఈమె చేసిన కొన్ని షోస్ కి బంపర్ రెస్పాన్స్ రావడం తో ఈటీవీ లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరికొన్ని ఎంటెర్టైమెంట్ షోస్ ని నిర్వహించారు. అన్నిటికి మంచి రెస్పాన్స్ వచ్చేవి. ఒకానొక సందర్భంలో లాస్య, రవి మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారేమో అని అనుకునేవారు.
కానీ లాస్య కొన్నాళ్ళకు మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇలాంటి రూమర్స్ కి తెర దించింది. ఇక పోతే పెళ్ళైన కొన్నాళ్లకు ఈమె బిగ్ బాస్ రియాలిటీ షో లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చక్కటి పద్దతి తో హౌస్ లో కొనసాగి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. అయితే బిగ్ బాస్ తర్వాత లాస్య కెరీర్ వేరే లెవెల్ లో ఉంటుందని అనుకున్నారు.
బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత పలు ఈవెంట్స్ లో చలాకీ గా పాల్గొంటూ కనిపించిన లాస్య ఆ తర్వాత బుల్లితెరకి, సినీ రంగానికి పూర్తిగా దూరం అయిపోయింది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఆమె అందరికీ ఇప్పటికీ కనెక్ట్ అయ్యుంది. తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే ఈమధ్య కాలం లో కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె ‘రెండు లివర్స్ ఎక్కువ వేసుకున్నారు..వెయ్యి రూపాయిలు అయ్యింది’ అంటూ చెప్పే డైలాగ్ మీద ఎన్నో రీల్స్, షార్ట్ వీడియోస్ వచ్చాయి.
లాస్య కూడా తన భర్త తో అలాంటి రీల్ ఒకటి చేసింది. తన భర్తకి అన్నం వడ్డించిన తర్వాత ఆమె కుమారీ ఆంటీ డైలాగ్ చెప్పడం తో భర్త మంజునాథ్ కుర్చీ తీసుకొని కొట్టబోతాడు. చూసేందుకు చాలా ఫన్నీ గా ఉన్న ఈ రీల్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కేవలం ఇదొక్కటే కాదు, ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఇలాంటి రీల్ వీడియోస్ ఇప్పటి వరకు చాలానే పెట్టింది. అన్నిటిలోకి ఈ వీడియో బాగా హైలైట్ అయ్యింది.