JAISW News Telugu

Rajeev Kanakala : రాజీవ్ కనకాల చనిపోయిన 14 సినిమాలు ఇవే..?

Rajeev Kanakala

Rajeev Kanakala

Rajeev Kanakala : సీనియర్ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు రాజీవ్ కనకాల. దేవదాస్ దర్శకత్వం వహించిన రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది లాంటి సీరియల్స్ లో రాజీవ్ కనకాల మంచి పాత్రల్లో కనిపించారు.

ఆ తర్వాత విలక్షణ పత్రాలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు రాజీవ్ కనకాల. 3 దశాబ్దాలుగా తన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఆయన ఇప్పటి వరకు 150 చిత్రాల్లో నటించారు. స్టూడెంట్ నెం. 1 సినిమా తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించారు. ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో ఆయన నటన విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురిపించాయి. తన కెరీర్ లో సహాయ నటుడిగా కన్నా విలన్ పాత్రలనే ఎక్కువ వేశారు ఆయన.

స్టార్ యాంకరైన సుమను ఆయన వివాహం చేసుకున్నారు. యాంకరింగ్ తో పాటు నటన వరకు తన మద్దుతు ఉంటుందని రాజీవ్ కనకాల ఆమెకు హామీ ఇచ్చారు. వారి అబ్బాయి రోషన్ బీకామ్ పూర్తి చేశాడు. ఇటీవల ఒక సినిమాలో హీరోగా కూడా వచ్చాడు. ఇక, అమ్మాయి మనస్విని యాంకర్ గా వస్తుంది కావచ్చని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు సినిమా ఛాన్సులు ఇవ్వాలని ఎవరినీ అడుగనని, ఆ పాత్రకు న్యాయం చేస్తారని వారికి అనిపిస్తే వారే ఛాన్సులు ఇస్తారని ఆయన బాగా నమ్ముతారు. అతను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చాలా వరకు పాత్రలు మరణించాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

1 స్వామి
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటించారు. ఆయనను హీరో హరికృష్ణ, హీరోయిన్ మీణ చంపుతారు.

2 అశోక్
ఇందులో రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో కనిపించారు. ఒక గొడవలో రాజీవ్ చనిపోతారు.

3 రాజుగారి గది 2
ఇందులో రాజీవ్ కనకాల హీరో అన్నయ్యగా నటించారు. రాజీవ్ మరణం గురించి తెలుసుకునేందుకే హీరో ఒక బంగ్లాలోకి వెళ్తాడు.

4 ఏ ఫిల్మ్ బై అరవింద్
విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో రాజీవ్ కనకాల నటించారు. ఆయన పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఇందులో ఆయన మరణిస్తాడు.

5 అతడు
మహేశ్ బాబు నటించని ఈ సినిమాలో రాజీవ్ కనకాల స్టోరీని మలుపుతిప్పే సన్నివేశంలో నటించాడు. ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటే పార్థుగా రాజీవ్ కనిపించాడు.

6 హరే రామ్
ఈ సినిమాలో రాజీవ్ కనకాల వైద్యుడి పాత్రలో నటించారు.

7 అతిథి
ఇందులో రాజీవ్ కనకాల గౌతమ్ అనే పాత్రలో నటించారు

8 దూకుడు
రాజీవ్ కనకాల మహేశ్ బాబు బాబాయ్ గా కనిపిస్తాడు. ఆయన పాత్ర చనిపోతుంది.

9 బాద్ షా
ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో రాజీవ్ కనిపించారు.

10 రాజా ది గ్రేట్
ఈ చిత్రంలో కూడా రాజీవ్ కనకాల పాత్ర మరణిస్తుంది.

11 రంగ స్థలం
రంగమ్మత్త అయిన అనసూయ పెనిమిటిగా రాజీవ్ కనిపిస్తాడు.

12 బింబిసార
ఇందులో రాజీవ్ కనకాల రాజీవ్ పాత్రలో కనిపించాడు. ఇందులో కూడామరణిస్తాడు.

13 వీర సింహా రెడ్డి
ఈ సినిమాలో కూడా రాజీవ్ పాత్ర చనిపోతుంది.

వీటన్నింటినీ పరిశీలిస్తే ఇవన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్. భారీగా కలెక్షన్లను తెచ్చిపెట్టిన సినిమాలు.. దీన్ని బట్టి చూస్తే ఏ సినిమాలో అయితే రాజీవ్ కనకాల మరణిస్తాడో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Exit mobile version