KCR : కెసిఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు వారే..

KCR

KCR and Kavitha

KCR : ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ తన తాజా కాలమ్స్‌లో, ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ జరుగుతున్న కుటుంబ రాజకీయాలను పచ్చిబయటపెట్టారు. కేటీఆర్, సంతోష్ రావు లాంటి వ్యక్తుల్ని *”దయ్యాలు”*గా పేర్కొంటూ, కవితకు వచ్చిన అవమానాలు, హరీష్ రావు స్థితి, బీజేపీతో వచ్చే లావాదేవీలు వంటి అంశాలపై ఆగ్రహంగా స్పందించారు.

కవితకు పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడమూ, అమెరికాలో జరిగిన సంఘటనలతో ఆమె కలత చెందినదీ, తాజా పరిణామాల్లో హరీష్ రావుతో టచ్‌లోకి వెళ్లడమూ రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ కుటుంబంలో అంతర్గతంగా ఏర్పడిన భిన్నాభిప్రాయాలు, బిజెపి నుంచి వచ్చిన ఆఫర్లు, అధికార భూషణాల కోసం సాగుతున్న పోరు ఈ మొత్తం దృశ్యాన్ని మరింత సంక్లిష్టంగా చేస్తున్నాయి.

ఇక రాధాకృష్ణ తన విమర్శలను కేసీఆర్, వైఎస్ఆర్ కుటుంబాల వరకే పరిమితం చేయడం, కానీ ఎన్టీఆర్ కుటుంబ విషయంలో మౌనంగా ఉండటం కూడా గమనార్హం. అయితే ఆయనే చెప్పకపోయినా, ప్రజలు అన్నీ గుర్తుంచుకుంటారు.

TAGS