Mahesh : మహేష్ కోసం పోటీ పడుతున్న ఆ ముగ్గురు దర్శకులు..తదుపరి చిత్రం ఎవరితో అంటే!

Mahesh

Mahesh

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు షెడ్యూల్స్ పూర్తయిన ఈ సినిమాకి, తదుపరి షెడ్యూల్ కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. సందీప్ రెడ్డి వంగ, బుచ్చి బాబు మరియు నాగ అశ్విన్ — ఈ ముగ్గురు టాప్ డైరెక్టర్స్ మహేష్ కోసం రెడీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ తదుపరి చిత్రం సందీప్ వంగతోనే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఫైనల్‌గా మహేష్ ఎవరితో సినిమా ప్రకటిస్తాడో చూడాలి.

TAGS