
Ambajipeta Marriage Band trailer
Ambajipeta Marriage Band : కలర్ ఫొటో, ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్ తో ఫేమస్ అయిన నటుడు సుహాస్ తన కొత్త చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శివాని హీరోయిన్ గా కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు (జనవరి 24)వ తేదీన విడుదల చేశారు.
లీడ్ హీరో మల్లి (సుహాస్), ఒక బార్బర్, ఓ మ్యారేజ్ బ్యాండ్ మెంబర్ పరిచయంతో ట్రైలర్ మొదలవుతుంది. లక్ష్మి (శివానీ)తో ప్రేమలో పడతాడు మల్లి. అంతా సజావుగా సాగుతున్న సమయంలో మల్లి గ్రామంలోని ఓ పెద్దమనిషితో గొడవ పడ్డాడు. గ్రామ పెద్దతో గొడవ తర్వాత అతని జీవితం ఎలా మలుపు తిరిగిందనేది సినిమాలో ప్రధానాంశం అని తెలుస్తోంది.
సుహాస్ మరోసారి తన సహజమైన నటనతో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ట్రైలర్ లో ఆకట్టుకున్నాడు. మొత్తమ్మీద అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఇంటెన్స్ స్టోరీలా అనిపిస్తుంది. ఫిబ్రవరి 2న థియేట్రికల్ రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.
కలర్ ఫొటో నుంచి సుహాన్ కు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామాలో సైకో పాత్ర వేసిన అతడు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. రైటర్ పద్మభూషన్ లో కామెడీతో కూడిన హీరోయిజం కనిపించింది. వీటితో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాకూడా కనిపించాడు సుహాన్. కొన్ని సినిమాల్లో హీరోకు స్నేహితుడి కనిపించి మెప్పించాడు.