Dr. Satheesh Reddy : హీరోలంటే వీరే: హైపర్ సోనిక్ మిస్సైల్ తో దేశాన్ని రక్షించిన డాక్టర్ సతీష్ రెడ్డి
Dr. Satheesh Reddy : ప్రపంచ దేశాలు తమ సైనిక బలాన్ని, సాంకేతిక శక్తిని హైపర్ సోనిక్ విమానాలు, మిస్సైల్స్ రూపంలో చూపిస్తూ, ఒకరినొకరు సవాలు చేసుకుంటున్న వేళ, అమెరికా తన హైపర్ సోనిక్ సాంకేతికతతో ప్రపంచాన్ని భయపెడుతున్నప్పుడు, చైనా మనపై కాలు దువ్వడానికి ఇదే శక్తిని వాడుతున్నప్పుడు… మన భారతదేశం కూడా ఈ రంగంలో సత్తా చాటింది. అందుకు కారణం మన తెలుగు తేజం, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. సతీష్ రెడ్డి.
నెల్లూరుకు చెందిన డాక్టర్ సతీష్ రెడ్డి, స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత వేగవంతమైన హైపర్ సోనిక్ మిస్సైళ్లను అభివృద్ధి చేసి, దేశ రక్షణ రంగంలో భారత్ కు సరికొత్త శక్తిని అందించారు. ఈ మిస్సైల్స్ వేగం గాలి వేగం కంటే ఏకంగా ఆరు రెట్లు అధికం. అంటే, సెకనుకు సుమారు 2 కిలోమీటర్లు, నిమిషానికి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. శత్రువు కళ్లు పడితే కూడా వీటిని పసిగట్టడం, అడ్డుకోవడం దాదాపు అసాధ్యం.
ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో కేవలం కొన్ని అగ్రరాజ్యాలకే పరిమితమైన తరుణంలో, భారత్ స్వయంగా దీనిని సాధించడం గొప్ప విషయం. ఇది అగ్రరాజ్యాలకు కూడా సవాలు విసిరే ఆత్మవిశ్వాసాన్ని భారత్ కు ఇచ్చింది. మన సైనిక శక్తిని అమాంతం పెంచింది.
సాధారణంగా మనం హీరోలంటే తెర ముందు కనిపించే నటులనో, క్రికెట్ మైదానంలో పరుగులు తీసే క్రీడాకారులనో అనుకుంటాం. డబ్బు కోసం కెమెరా ముందు నటన చేసేవారికో, యాడ్స్ కోసం సెంచరీలు లెక్కపెట్టుకునేవారికో, కేవలం డూపులతో ఫైట్లు చేసేవారికో కాదు మనం వందనం చేయాల్సింది. బంతిని కర్రతో కొట్టి సెంచరీలు అనిపించుకునేవారికో, తొడగొట్టి రైలాపి నట్లు, వట్టి డూపులతో వందమందిని కొట్టినట్లు మోసం చేసే యాక్టర్లకు కాదు మనం గౌరవం ఇవ్వాల్సింది.
నిజమైన హీరోలు దేశ రక్షణ కోసం, ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే సైనికులు, శాస్త్రవేత్తలు, రక్షణరంగ నిపుణులు. డాక్టర్ సతీష్ రెడ్డి లాంటి శాస్త్రవేత్తలు, వారి కృషి దేశ భవిష్యత్తుకు రక్షణ కవచం. శత్రు దేశాలు మనవైపు చూడాలంటేనే భయపడేలా చేసే అసలు సిసలు సూపర్ హీరోలు వీరే.
డాక్టర్ సతీష్ రెడ్డి సాధించిన ఈ విజయం యావత్ భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారందరికీ గర్వకారణం. మన అభిమానానికి అర్థం పరమార్థం ఉండాలి. దేశాన్ని కాపాడే, దేశ భవిష్యత్తుకు బాటలు వేసే డాక్టర్ సతీష్ రెడ్డి లాంటి దేశభక్తులను, వీరులను మనం నిజమైన హీరోలుగా గుర్తించి గౌరవించుకోవాలి.
డాక్టర్ సతీష్ రెడ్డి గారి లాంటి మొనగాడికి వందనం తెలుపుతూ, వారి కృషికి జై కొడదాం! వీరే మన అసలు సిసలు హీరోలు!
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!
సతీష్ రెడ్డి గారి లాటి మొనగాడా !
జై హింద్! జై సతీష్ రెడ్డి!