Trump : ట్రంప్ కు కోపం వచ్చింది.. వైట్ హౌస్ లో తిట్టేశాడు.. వైరల్ 

Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాతో సమావేశం సందర్భంగా, ఖతార్‌ ఇచ్చే బోయింగ్‌ 747–8 విమానం గురించి విలేకరి అడిగిన ప్రశ్నపై ట్రంప్ కోపంతో విరుచుకుపడ్డారు. విలేకరిని మందలించి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖతార్‌ ఇచ్చే ఈ విలాసవంతమైన విమానం రాజకీయ దుమారం రేపుతోంది, నైతికతపై చర్చను తెరపైకి తీసుకొచ్చింది.

TAGS