JAISW News Telugu

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.. కానీ ట్విస్ట్ ఇదే..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకులు వల్లభనేని వంశీకి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 1 రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు షూరిటీలు సమర్పించాలనే షరతుతో కోర్టు ఈ బెయిల్ ఇచ్చింది. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరైంది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు అయిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలపై వల్లభనేని వంశీని గత ఫిబ్రవరి 13, 2025న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లో ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ లభించినప్పటికీ, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఇంకా బెయిల్ మంజూరు కాకపోవడంతో వల్లభనేని వంశీ జైలులోనే కొనసాగనున్నారు. టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఆయనకు బెయిల్ లభించిన తర్వాతే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు కేసులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Exit mobile version