Varun-Lavanya : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట తక్కువరోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్నారని అధికారికంగా ప్రకటించడం మెగా ఫ్యాన్స్‌లో సంబరాలకు కారణమైంది. సహజంగా హీరోయిన్‌లు పెళ్లి తర్వాత సినిమాలు, గ్లామర్ గురించి ఆలోచిస్తారు కానీ లావణ్య కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పాలి. వీరి ప్రేమకథ 7 ఏళ్లుగా కొనసాగి, చివరికి పెళ్లి వరకు చేరింది. వరుణ్ తేజ్ కెరీర్‌లో కొన్ని అప్‌లు, డౌన్‌లు ఉన్నా, ప్రస్తుతం గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త పాత్రతో ఆయన కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.