
Sayaji Shinde
Sayaji Shinde : ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు.
ప్రస్తుతం షిండే పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జి చేస్తామన్నారు. గతంలో కూడా ఆయన ఒకసారి ఛాతీనొప్పికి గురయ్యారు.